గోపురం ఏందుకు?



ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు.గర్భగుడి భగవంతుని శిరస్సు,ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి,స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.

కాని....
ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు(వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామిపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది. ఇతర దేశాలు,రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.

అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది.వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి.అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు.వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా. అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు (ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పిడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.


Latest
Previous