తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే శివ అక్షరమాలా స్తోత్రం.. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

""ద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ
""నందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ
"ఇం"దు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ
""శ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ
""రగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ
""ర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ
""గ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ
""పనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ
"ళు"ల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ
"ళూ"తాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
       
""కానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ
""శ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ
"ఓం"కారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ
""రసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ
"అం"బరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ
"ఆహా"రప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ
""మలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ
""డ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ
"గం"గా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ
"ఘా"తక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ
"జ్ఞా"న్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ
"చం"డవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ
""త్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ
""న్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ            
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
"ఝం"కారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ
"జ్ఞా"నాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ
"టం"కస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ
"ఠ"క్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ
"డం"భవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశ శివ
"ఢం"ఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ
"నా"నామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ
"త"త్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ
"స్థా:వరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ
"దం"తివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ
"ధ"రణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ
"న"ళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ
"ప"న్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ
"ఫా"లవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ          
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

"బం"ధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ
"భ"స్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ
"మ"న్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ
"య"తిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ
"రా"మేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ
"లం"కాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ
"వ"రదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ
"శాం"తిస్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ
"ష"ణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
"సం"సారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ
"హ"రపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ
"లా"ళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ
"క్ష"రరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

Next
Previous