ఏటన్నావ్ మామ ఏటన్నావు కోడికూసె జాములోన! (రచయిత్రి : రాధాకుమారి)

ఏటన్నావ్ మామ ఏటన్నావు
కోడికూసె జాములోన
ఏటిగట్టు కాడ నన్ను
వేచిజూడ మన్నావే...!!

యాడున్నావ్ మామ యాడున్నావు
కోడికూర చిల్లిగారె
తమలపాకు చిలకచుట్టి
పంచదార పరువంతో రమ్మన్నావే..!!

ఏటన్నావ్ మామా ఏటన్నావూ
సుక్కల చీరగట్టి చింతపూల రైక తొడిగి
కొప్పులోన పూలుబెట్టి
వయ్యారపు వంపులన్నీ తెమ్మన్నావే...!!

యాడున్నావ్ మామా యాడున్నావు
సిగ్గులన్ని పోగుజేసి బుగ్గలందు రంగరించి
పరువమంత పోతపోసి పెదవులకే కట్టబెట్టి
వంపుసొంపులన్ని వందనంగ ముడుపుగట్టి
నీ జాడకు కాచియున్న.. నీకోసం వేచియున్న..!!

యాడున్నావ్ మామ యాడున్నావు..!!

రచయిత : అవ్వారు రాధాకుమారి.

Next
Previous