నీటులంట గేటులంట ఎంట్రన్సుల టార్చరంట! (రచయిత్రి : రాధాకుమారి)





నీటులంట గేటులంట
ఎంట్రన్సుల టార్చరంట
మితిమీరిన ఆంక్షలతో
విద్యార్థుల మానమంత
మంటగలిసె సూడమంట..!!

రైతన్నలు చెమటోడ్చి
పైసపైస కూడవెట్టి
బిడ్డలపై ప్రేమతోడ
చదువులకై ఆర్తితోడ
కార్పొరేటు పాలుజేసె
ఆరుగాల కష్టమంత..!!

కార్పొరేటు సంస్థలన్ని
విద్యార్థుల ఆసరాగ
పీల్చిపీల్చి పిప్పిజేసె
పేదవాని కష్టమంత
పేర్చిపేర్చి మేడగట్టె
పిల్లగాళ్ళ నడ్డమెట్టి..!!

పుస్తకాల జ్ఞానమంత
పిలగానికి సెప్పనీకి
దుడ్లు దండె లక్ష్యంగా
వ్యాపారపు రొంపిలోకి
లాక్కెల్లెను విద్యనంత..!!

నేటి మేటి యాపారం
కార్పొరేటు సంస్థలన్ని
హుందాగా చేసేటి
చదువులమ్మె సంతలంటె
వింతయేటి గాదేమొ..!!

(రచయిత్రి : రాధాకుమారి)


Next
Previous