ఇన్ని అద్భుతాలు ఎక్కడ దాచావో... నులువెచ్చని నీ కౌగిలిలో

ఇన్ని అద్భుతాలు ఎక్కడ దాచావో...
నులువెచ్చని నీ కౌగిలిలో ...
ఇంత వలపు ఎక్కడ ఉంచావో...
అలుపెరగని నీ ఎద సవ్వడిలో....
ఇన్ని హోయలు ఎక్కడ దాచావో...
హోరెత్తే నీ ఉరుకుల పరుగుల జలపాతంలో...
ఇంత సోగసు ఎక్కడ ఉంచావో...
నిరంతరం నాకై మెదలాడే నీ ఊహాలలో...
ఇంతందంగా ఎవరు మలిచారో....
సృష్టికే ప్రతిసృష్టి ని ఎవరు చేశారో ..
సప్తవర్ణాల శోభను ఎవరు పులిమారో...
మధురరసమయమైన చిలుక పలుకులలోని,,,
ఈ కులుకులను ఎవరు నేర్పారో....
??????????????????????????????????
"ఇన్ని అద్భుతములు మహాద్భుతముగా,,,
మలిచిన ఘనుడవు,, రసజ్ఞుడవు,,మనోహరుడవు,,
నీవు కాక ఇంకెవరు సుమా...."
🌹సుహానిరాజ్


Next
Previous