సిగ్గలన్ని మూట గట్టీ బుగ్గలందు దాచేసి ;; (రచయిత్రి : రాధాకుమారి)





సిగ్గలన్ని మూట గట్టీ
బుగ్గలందు దాచేసి
అందమంత పోగుచేసి
పెదవులందు పూసేసి

సక్కనోడు నా మామ
కన్నెవిందుకొస్తనంటె
కవ్వింపుగ కళ్ళతోనె
రారమ్మని సైగ జేస

సరాసరా నా మామ
సిర్రెత్తి పోయాడె
వస్తూనే ఒక్క ఉదుటున
చిరుతలాగ దూకాడె

మాటలన్ని మూగపోయె
మౌనాలే రాజ్యమేలె
జాబిలమ్మ సిగ్గుతోడ
మబ్బు సాటు దాక్కుండె

అందాలకు సరిజోడుగ
రేయికూడ కరిగిపాయె
సన్నజాజులన్ని కూడ
నామల్లె నలిగిపోయె

(రచయిత్రి : రాధాకుమారి)

Next
Previous