Nannaku Premato


పురాణాల దగ్గర నుండి నేటి కాలం వరకు అమ్మని చూపించినంతగా ఏకాలంలోనూ ఏ యుగంలోనూ నాన్నను చూపించలేదు. బాగా చదువుకోరా! త్వరగా ఇంటికి రారా! తొందరగా పడుకోరా! అంటే! మానాన్న ఏంటి బాగా నస పెడుతున్నాడు. చాదస్తం అనుకుంటా! ఏమి తెలియదనుకుంటా! అందుకే ఇలా అయిపోయాడు అనుకుంటారు. అప్పుడు మనకి ఏమి తెలీదు. ఎందుకంటే! మూడు పూటలా గడిచిపోతుంది. 25ఏళ్ళు వచ్చాక కొన్నాళ్ళకి పెళ్ళయ్యాక ఉద్యోగం, ఖర్చులు, అవసరం కోసం చేసిన అప్పులు చూసి మానాన్నే నయం. నలుగురు పిల్లల్ని కని పెంచి పోషించి ఆస్తులు కూడబెట్టి ఇచ్చాడు. విలువలు నేర్పాడు. ఎక్కడ తన బాధని బయట పెట్టలేదు. అంటూ బుర్ర గోక్కుంటూ ! నాన్న మనం అనుకున్నంత వెస్ట్ కాదనుకుంట! ఒక్కడిని కూడా కనకుండా ఇంత కష్టం అనిపిస్తుంది. పిల్లలు పుట్టాకా! స్కూల్ ఫీజులు, ఆరోగ్యం పాడయ్యినప్పుడు అర్థరాత్రులు ఆసుపత్రులకు పరిగెట్టినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బులు కోసం వెదుక్కోవడం ఇలాంటి సమయంలో నాన్న గుర్తొస్తాడు.కళ్ళల్లో నీళ్లోస్తాయి. అయ్యబాబోయ్ ఇన్ని కష్టాలు పడ్డాడా! నాన్న! అనుకుంటారు. ఇవన్నీ తెలుసుకునే సరికి చాలామంది నాన్నలు ఉండరు. పటాలలో గోడమీద ఉంటారు.అందుకే తండ్రి బ్రతికి ఉండగానే ఆయన్ని అయన కష్టాన్ని గుర్తించండి. బాధ్యతల బరువును మోసి గుర్తింపు లేకుండా కలగార్బంలో కలిసిపోయిన నాన్నలు ఎందఱో ఉన్నారు. తండ్రి సంపాదించిన ఆస్తిని, తండ్రివలన వచ్చిన పేరుని తీసుకొని జీవితాన్ని సాగిస్తారు. కాని నాన్నకు మనం ఏమి ఇస్తున్నాం? ప్రశ్నించుకోండి. కనీసం జ్ఞాపకంలా గుర్తుంచుకోండి. నాచిన్నప్పుడే నాన్న దూరమయ్యాడు. కాని ఈరోజు వరకు ఆయనంటే నాకు కోపం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ ద్వేషం నాకు తెలీదు. అయినా జన్మ ఇచ్చాడు. ఆయనవలన నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఆ గౌరవం నాకు ఉంది. 2012 వరకు నాకు ఏ ఆస్తి లేదు. చేసుకుంటే తినడం లేదంటే ఊరుకోవడం. ఒకరి ముందు ఎప్పుడూ చేయి చాచి యాచించలేదు. ఉన్నంతలో తిని గౌరవంగా బ్రతికాం. స్నేహితులు నన్ను తండ్రిలా ఆదరించారు. ఈరోజుకి నాకు పరిచయం అయిన వారిని సాయం చేసినవారిని ఎవరినీ వదులుకోలేదు. మరచిపోలేదు. ఇక్కడే కాదు ఇప్పుడే కాదు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక ముద్ద పెట్టె ప్రతివాడు తండ్రితో సమానమే! తల్లితో సమానమే! ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి. సయం చేయకపోయినా పర్లేదు. కృతజ్ఞత కలిగి ఉండండి. జీవితంలో చాలామంది మనకోసం ఉన్నారు. ఉంటారు. కాకపోతే ఎవరెలా ఉపయోగపడతారో తెలీదు. అందుకే మిత్రుడిని శత్రువుని ఎవరిని వదులుకోవద్దు. మిత్రుడిని వదులుకోవద్దు. శత్రువుని ద్వేషించవద్దు. వీలయితే అప్యాయతగా పలకరించండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.
Next
Previous