ఇచ్చెయ్యవా... ఇకనైనా ఇచ్చెయ్యవా... నీ జ్ఞాపకాల ప్రవాహములను,, ఆపలేక,,వాటి ధాటికి ఉండలేక,,



ఇచ్చెయ్యవా...
ఇకనైనా ఇచ్చెయ్యవా...
నీ జ్ఞాపకాల ప్రవాహములను,,
ఆపలేక,,వాటి ధాటికి ఉండలేక,,
చిలకలా కొట్టుమిట్టాడుతున్న,,,
నా మదిని నాకు ఇచ్చెయ్యవా...

కోవెలలాంటి హృదయంలో,,
నీ రూపు కనబడకుండా,,,
అగరొత్తుల పొగ ఏదో కమ్ముకున్నది...
దీపపు వెలుగులో నీ మోము,,,
చూడలేక కనులు నిండా నీరు నిండియున్నది...

వెనెల్లో నీ వేణు గానమేదో,,
సున్నితంగా దేహ తెరల్ని,,
తొలుచుకుంటూ హృది కవాటాన్ని,,
సుతిమెత్తగా తాకుచున్నది...

వర్షపు నీరే లేని కారుమబ్బుల్తో,,
కటిక చీకటి కమ్మిన్నట్టు,,
కమ్ముకుని వున్న దట్టమైన,,
పొగమంచేదో నన్ను కప్పివున్నది...

నీ ఆవేశ అగ్ని జ్వాలలు,,
నిలువెల్లా నన్ను కాల్చేస్తున్నా...
నాలో ఓ చిరు నవ్వుల,,
తొలకరి జల్లు నిన్ను,,
మంచుముద్దలా కరింగించక పోతోందా??
అనే నీ ఊహ నన్నిలా వుండానిస్తుందేమో...

ఇచ్చెయ్యవా,,
నా మనసు నాకు ఇచ్చెయ్యవా....
గతం తాలూకు మధుర జ్ఞాపకాల,,,
అలజడులన్నీ నా దోసిట్లో నింపేయ్యవా...
పగిలిన నా మదిని కానుకగా,,
నాకు ఇచ్చెయ్యవా....

ఈ జన్మకు కన్నీటిని పానియంగా,,
ఇచ్చిన నీకు నేనేమివ్వగలను,,
ప్రపంచం ఉన్నంత వరకు,,,
నిన్ను ప్రేమించడం తప్ప....


 సుహానిరాజ్

Next
Previous