హృదయ కాంక్షలు వర్షిస్తున్నాయి (తెలుగు కవితలు)

హృదయ కాంక్షలు వర్షిస్తున్నాయి
అనురాగ జలధు లై, రస జ్వలిత రాగ దాహపు పొగల

మధువులు చిందే అధరవు సెగలను 
మమతల నదులతో ముంచేసే సుధా రసాలు,

మొగలిపొదలా రగిలే కౌగిలిలో
శరీరానురాగ నీలిమలో
కరిగి కలిసి కురిసి ప్రవహించే అవిరళ మేఘాలు,

నా మోహాలు మోహన లహరిలో పునీతమవుతూ 
నేను ప్రణయపు నదిలో నీ మదిలో పరిపూర్ణ మౌతూ

మహాతృష్ణల కాంక్షా కీలల్లో జ్వలిస్తూ రమిస్తూ
శమిస్తూ శాంతిస్తూ....


మీ సంధ్య..

Next
Previous