ప్రతి కాలానికి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది . చూసే కళ్ళకీ, ఆస్వాదించే మనసుకే అవి తెలుస్తాయి.



🌿 కాలం 🌿
ప్రతి కాలానికి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది .
చూసే కళ్ళకీ,
ఆస్వాదించే మనసుకే అవి తెలుస్తాయి.
వేసవి కాలంలో తెల్లవారు జామున వచ్చే ఆ చల్లగాలి ఎంత హాయిగా ఉంటుందంటే....
నచ్చిన వారిని చాటుగా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ... అంత.
వర్షకాలంలో కిటికీలోంచి బయటికి చూస్తే వానకి తడిసి ముద్దవుతున్న ఆ ఆకులను చూస్తే..
మనసుకి నచ్చిన వారు మన కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూస్తుంటే ....
ఉక్కిరి బక్కిరి అవుతున్న 'మనం' లా ఉంటుంది.
ఇక శీతాకాలం..........
ఏం చెప్పాలి............
ఎంత చెప్పినా సగం మిగిలే ఉంటుంది.
చెప్పలేను, చెప్పకూడదు , చెప్పించలేము.
దాన్ని అనుభవించాల్సిందే తప్ప మాటలు సరిపోవు...
హు...........
🌿కాలం-మనం🌿
మీ
🌿తృష్ణ🌿

>
Next
Previous