నాకు స్వార్థం ఎక్కువ!





ఎందుకంటే! నేను ఎక్కడి నుండో ఊడిపడలేదు. నేను ఇక్కడికి రావడానికి కారణమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా ఎక్కడో ఎడారిలో ఒంటరిగా లేదు, ప్రతి సందర్భంలో ఉపయోగపడే సంఘంలో ఉంది. ఆ సంఘం ప్రకృతిలో ఉంది. 

నేను వృద్ధికి లోకి రావడానికి నాకుటుంబం నాకెంతగానో ఉపయోగపడింది. నాకుటుంబానికి సంఘంలో ఉన్న చాలామంది ఎదో ఒకరూపంలో ఉపయోగపడుతూనే ఉన్నారు. తినే తిండి దగ్గర నుండి పడుకునే మంచం దగ్గర నుండి వేసుకునే బట్ట దగ్గర నుండి, చదువు వైద్యం, విద్య, ఇలా అన్నిటిలో సంఘం పాత్ర ఉంది. అలాగే నేను కానీ కుటుంబం కానీ సంఘం కానీ ఒంటరిగా లేము. ప్రకృతిలో మమేకమై ఉన్నాం. త్రాగే నీరు, పీల్చేగాలి, నిలవడానికి భూమి, వండుకోడానికి అగ్ని, శబ్దాలు చేరవేయడానికి ఆకాశం. ఇలా ప్రకృతి అందరికీ ఉపయోగపడుతుంది. జంతువులు, పక్షులు, జలచరాలు, వాయుచరాలు ఇవి కూడా ప్రకృతిలో భాగమే! ఆవులు పాలు ఇస్తాయి. తల్లి తరువాత తల్లి, పాములు పంట పొలాల్లోని కలుగులో ఉన్న ఎలుకల్ని కప్పల్ని తింటుంది. పక్షులు పంటపొలాల్లో చీడ పీడీలని నాశనం చేసేస్తాయి. వానపాములు, ఇలా ప్రతి ఒక్క జంతువూ మనకి ఎదో ఒకరూపంలో ఉపయోగపడుతూనే ఉంది. వీటితోపాటు ఈ ఐదు అంశాలని మమేకం చేసి లోటుపాట్లు లేకుండా నిరంతరం కాపాడే భగవంతుడు ఉన్నాడు.. ఈ ఐదు అంశాలలో ఏ ఒక్కటీ ఎక్కడి నుండో ఊడిపడి కలిసి లేవు. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి కలిసి కలగలిసి ఉన్నాయి. వేరువేరు అనుకుంటే వారిని ఏమనాలో నాకు తెలీదు.. 

నేను బావుండాలి. అనే స్వార్థం, నాకుటుంబం బావుండాలి అనే స్వార్థం, సంఘం, ప్రకృతి, భగవంతుడు అందరూ బావుండాలి. చాలా బావుండాలి. ఇది నాలో అత్యంత లోతుల్లో నిగూఢమై ఉన్న హృదయాంతరాళాల్లో పాతుకుపోయి ఉన్న స్వార్థం.. అవును నాకు స్వార్థం చాలా ఎక్కువ..

శ్రీశ్రీ.. 

Next
Previous