వాలిన పేద కళ్ళలో కనుచూపు మేరలో కానరాని వెలుగు (తెలుగు కవితలు)





వాలిన పేద కళ్ళలో
కనుచూపు మేరలో
కానరాని వెలుగు

నింగిమబ్బు పొంగదాయే
వాన చినుకు రాలదాయే



బతుకు బాధ తీరదాయే
తిండిగింజకు తిప్పలాయే

పొలం పంట పండదాయే
కడుపు మంట ఆరదాయే

అప్పులన్ని కుప్పలవుతూ
చేతిలోన చిప్పమిగిలే

బాధ పొంగి గంగ లాయే
జొన్నచేను ఎండిపోయే

దిగులు గుండె కుంగి పోయే
ప్రభుత్వం అండ లేకుండా ఉండే

తాకట్టులోన పుస్తెలాయే
బతుకేమో చితికిపోయే

కల్తీలలో. విత్తనాలు
తెగుళ్లలో పంటలాయే

ధరలన్ని కుప్పకూలే
పెట్టుబడి పెంటపాలయే

ఊరువిడిచి వాడ విడిచి
పొలాలన్నీ అమ్మి వేసి

దిక్కులేక దారిలేక
పట్నం దారి పట్టి తరలె

పల్లెలన్ని వల్లకాడులాయే
చెట్టు పుట్ట మూగబోయే

ఊరి చివర గుడి చిన్నబోయే
అవనితల్లి తల్లడిల్లే

ముసలి అవ్వ వంటరాయే
గంజి పొసే కొడుకు పోయే

మోట బావి ఎండిపోయే
కంటి చెలమ నిండి పోయే

రైతన్న కుమిలి పోయే
రాతి దేవుడు కరుగడాయే

మీ సంధ్య


Next
Previous