పుత్రులుగా జన్మించెది ఎవరు?

1. ఎవరైనా సొమ్ముని దాచమని ఇచ్చి దానిని తీసుకోకుండా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి సొమ్ము ఇచ్చిన వ్యక్తికి పుత్రుడిగా జన్మిస్తాడు.
2. ఎవరినుండి అయినా సొమ్ము అప్పుగా తీసుకొని అది తీర్చకుండా మరణించిన వ్యక్తి ఆ అప్పుని తీర్చడానికి తరువాతి జన్మలో తనయుడిగా జన్మించి తండ్రిని బాగా చూసుకుంటాడు.
3. పూర్వజన్మలో శత్రుత్వం తీర్చుకోవడానికి ఈజన్మలో కొడుకుగా జన్మించి వేధిస్తాడు.అంటే ఇప్పుడు కొందరు తండ్రులకి నరకం స్పెల్లింగ్ రాయిస్తున్న కొడుకులు వాళ్లే. కొడుకుగా పుట్టాడని కొడుకు అనుకోకండి..
4. తనకి అపకారం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోలేని స్థితిలో మరణిస్తే ప్రతీకారం తీర్చుకోవాడికి కొడుకుగా జన్మిస్తాడు.
5. తనకి ఉపకారం చేసిన వారి రుణం తీర్చుకోవడానికి మారుజన్మలో కొడుకుగా జన్మిస్తాడు.
6. తనకు సేవ చేసిన వారి కి సుఖం కలగజేసినవారి రుణం తీర్చుకోవడానికి...
7. కొన్నిసార్లు ఈప్రపంచానికి సంబంధించిన విధులు నిర్వర్తించడానికి పుత్రుడిగా జన్మించి పుత్రోత్సాహం కలుగజేస్తాడు..
వీరు ధర్మశాస్త్రం ప్రకారం తండ్రులకి జన్మించి వివిధ రకాల పుత్రులు.. తల్లి మాటేమిటి అనుకోవచ్చు. తండ్రిలో సగభాగం తల్లి కనుక తల్లి కూడా అనుభవించాల్సిందే. ఎవరెవరు ఎవరికీ బాకీ ఉన్నారో వారందరూ ఒకదగ్గర చేరతారు. అంతేకాని తండ్రివలన తల్లి కూడా బాధపడుతుంది అనుకోకండి. 
కృష్ణమనోహర్.... 

Next
Previous