జాబిలి మబ్బు చాటునైన అందమే (తెలుగు కవితలు)





అందని దాని మీద ఆశ పడకూడదు.
అందంగా ఉన్న ప్రతీదీ అందుకోవాలి అనుకోకూడదు.
అందరికీ అన్నీ అందవు.
అందులోని అంతరార్థాన్ని

అందిపుచ్చుకుని అద్బుతమైన జీవితాన్ని
అనుభవించు.

🌿 తృష్ణ🌿




ఎక్కడో నీవు...
ఇక్కడనేను....
ఎప్పుడు మాట్లాడతావు అని నేను ఎదురు చూస్తున్న..
ఎప్పుడెప్పుడు నేను మాట్లాడాతానా అని నువ్వు చూస్తూ ఉన్నావు
మౌనాలలోనే ప్రశ్నలు...
అడగలేని మౌనాలు
చెప్పలేని మౌనాలు
ఎప్పటికి తరగని ఈ దూరాలు
🌿తృష్ణ🌿



మెున్న గుడిలో
చటుక్కున బొట్టు పెట్టి
నోట్లో ప్రసాదం పెట్టింది.

పెరట్లో ఉందంటే వెళితే 
మేడ మీదకు వెళ్ళింది.
మేడ మీదకెళితే
గుమ్మం ముందువున్నది.
అక్కడికి వెళితే వంటగదిలో
కాఫీ కలుపుతోంది.
కాఫీ తీసుకొని తాతయ్యకిచ్చి
పక్కనే కూర్చుంది.
ఇంకేముంది మెుహం తిప్పుకున్నా...
గుడికెళ్తున్నా............అంది.
ఆనందంతో తిరిగాను.
చూస్తే పక్కన బామ్మ ఉంది.
సాయంత్రం తనని అడిగా...
కళ్ళతో...
రాత్రికి మేడ మీదకు రమ్మని...
తన పెద్ద పెద్ద కళ్ళతో రాను అని
చెప్పింది.
హు.............
🌿తృష్ణ🌿



💚ప్రేమలేఖ💚
నచ్చేసావు....
బాగా...నచ్చెేసావు...
అన్నీ..తెలుసుకున్నాను...
ఇన్నాళ్ళు ..ఎదురు చూసింది ....
నీకోసమేనా...!
చాలా బాగుంది ఈ ఫీల్...
నాలో నేనే మాట్లాడుకోవటం...
ఒంటరిగా ఉండాలనిపించటం...
నీ మాటలే చెవుల్లో వినిపించటం..
ఏం చెప్పను...!
నువ్వు-కలం, నేను-కాగితం
నువ్వు-పాట, నేను-శృతి
నువ్వు-మనసు, నేను-భావం
నువ్వు-మౌనం, నేను-భాష..
అందానికే హుందాతనం తెచ్చావురా...
అచ్చయిపోయావు నీ చెలి హృదయంలో..!!

🌿 తృష్ణ🌿



నువ్వున్నావని శుభోదయం
నువ్వుంటావని శుభోదయం
నువ్వునేను మనమై నందుకు
మనలో మనం ఒకటైనందుకు
మీ మా లు చెరిగినందుకు
శుభోదయం
🌿తృష్ణ🌿

అబ్బా....
వీడు ఇటే వస్తున్నాడు.....
వీడిని తప్పించుకోవాలనేగా ఈ దారినవచ్చా

ఏమి అడుగుతాడో.....
ఏమి చెప్పాలో...
తోచి చావట్ల....
నాకేమి తెలుసు వీడు ఇలా వస్తాడని
ఏమి అడగకుండా వదిలి పెట్టడు
అబ్బా.....
ఏంచెప్పాలో
వీడెక్కడి వాడు...
చస్తున్నా.......
అయ్యో చూసేసాడే...
🌿 తృష్ణ🌿



జాబిలి మబ్బు చాటునైన అందమే
పువ్వంటి నీ నవ్వు చాటునైన అందమే
అందం జాబిల్లిలో కాదు వెన్నెలతో
అదే వెన్నల వంటి నీ మనసుతో
🌿 తృష్ణ🌿


Next
Previous