న్వువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యం నాకు.





న్వువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యం నాకు.
నేను ఎంత స్ర్టాంగ్ గా ఉండాలో నువ్వు ఎప్పుడూ నూరి పోస్తూనే ఉంటావు,
నెనో వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని.

 దేనికి తలొగ్గదని, నువ్వు ఏది చెప్పినా నామంచి కొరకే నీవు చూపించే ప్రేమకి నేను అర్హురాలి గా ఎప్పటికీ నిలవగలనా అన్నదే నాకో పెద్ద సవాలు.
నన్నెప్పుడుూ వెంటాడే భయం, ఏదైనా పరిస్ధితుల లో నిన్నుకోల్పోతానేమో అని.

       🌿తృష్ణ🌿



నీ ఒడిలో వాలిన క్షణం
రాసేస్తోంది  ఓ మధుర కావ్యం
తనివి తీరని హాయికి అంకితమిస్తూ..
               
నింగినుండి నాకై జారిన చంద్రకళవై
వెన్నెల సుమపాతాల నవ్వులతో
ముత్యాల ధారలో మునకలేయిస్తుంటే
నీదైన లోకంలో వరమై
ఒదిగిపోతోంది  మది  పసిపాపలా...
                                   
ప్రధమ చరునికై వచ్చిన
                        ప్రేమనాయికవై
కోటికాంతుల మెరిసే కాంతలా
చూపుల అమృత కలశాలతో
అలసిన ఎదపై చిలకరిస్తుంటే
అశలన్నీ ధీర్ఘాయిష్షు పోసుకొంటూ
ఊహల ఊయలలూగుతోంది
        మృదుమంజుల భావం
                         
 జాబిల్లి మోముని అరచేతుల నడుమ
 బంధిస్తున్న అందమైన క్షణం
 అడుగడుగికి వంతెనేస్తున్న కాలం
 తెలుపుతోంది బంధానికి కొత్త భాష్యం


Next
Previous