కూటికోసం కోటి పాట్లు ప్రాణాలను సైతం లెక్కచేయని బ్రతుకులు (తెలుగు కవితలు)






కూటికోసం కోటి పాట్లు

ప్రాణాలను సైతం లెక్కచేయని బ్రతుకులు



డ్రైనేజీలు బాగుచేస్తూ

కొన్ని సార్లు తమ ప్రాణాలనే కోల్పోతూ

విసర్జితాలను చేయితో ముడుతూ
అందరి వ్యర్థాలను శుభ్రo చేస్తూ

దుర్గంధాన్ని పీలుస్తూ 
మానవత్వాన్ని గుభాలించే
కష్టజీవులు.

సిపాయిలు దేశాన్ని రక్షిస్తే
ఈ సపాయి దేహాన్ని రక్షిస్తాడు

రోగాన్ని రాకుండా
ఆరోగ్యాన్ని కాపాడుతూ
వైద్యుడితో సరి ఈ సోదరుడు

ఆధునిక సమాజపు ఆటవిక న్యాయం
మరయంత్రాల పనులు మనుష్యులతో
చేయించడం

యంత్రాలు ఉన్నా మనుషుల తో చేయిస్తూ
అమానవీయ పనులకు అమాయకులను
బలి చేయడం అన్యాయం

ఇలాంటి వృత్తిని నిర్ములించాలి
దీనిపై ఆధారపడి జీవించే వారికి
ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి

పరిసరాలను శుభ్రంచేస్తూ
ప్రాణాలను కాపాడే సిపాయిలు

మీ సంధ్య.....


Next
Previous