* మౌనంతోనే మనసు దోచేయవచ్చని నీ పరిచయం అయ్యే వరకు తెలియదు .


* మౌనంతోనే మనసు దోచేయవచ్చని
  నీ పరిచయం అయ్యే వరకు తెలియదు .

* నిను చూసి మాట మూగైబోతుంది
 మనసు సరికొత్తరాగం ఆలపిస్తుంది.

* చూపుతో గాయం చేస్తారు అంటే వట్టి మాటలనుకున్న
నీ చూపు నా ఎదని తాకాకే తెలిసింది
ఆ గాయం కూడ తెలియని పరవశాన్ని ఇస్తుందని .

* ఒంటరిలో మరింత ఆనందం ఉంటుంది అంటే నవ్వుకున్నా
 నీ తలపుల ఏకాంతంలో లీనం అవుతూ ఉంటే అర్థం చేసుకుంటున్నా .

* ఒక్కసారి చూస్తే చాలు జన్మధన్యం అంటే పిచ్చి మాటలనుకున్న
నీకై ఎదురుచూసే చూపులో ఆ ఒక్కసారి విలువ తెలుసుకుంటున్నా.

* జాబిల్లినే ప్రతీ ప్రేమకి రూపాన్ని ఆపాదిస్తుంటే వెర్రి వాళ్ళు అనుకున్న
 నిన్ను కూడ ఆ జాబిల్లిలో చూసే వరకు తెలియలేదు
ప్రేమంటే వెన్నెల్లా మనసైనదే అని ...
Rk.Bhagath

Next
Previous