శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం

 (ఈ స్తోత్ర పారాయణంమహిమ చెప్ప నలవికానిదని సుందరకాండ పఠనం చేసినంత ఫలం యిచ్చునన్న ప్రభోదం అనుభవంతో మహాఋషుల ఉవాచ)

 "నమోహనుమతేతుభ్యం నమో మారుత సూననే ! 
నమః శ్రీరామ భక్తాయ శ్యామలాంగాయతే నమః!! 

నమో వానరవీరాయ సుగ్రీవ సఖ్య కారిణే !
లంకావిదహనార్ధాయ హేలా సాగర తారిణే !! 

సీతాశోకవినాశాయ రామముద్రా ధరాయచ ! 
రావణాదత్తకులచ్ఛేద కారిణేతే నమో నమః !! 

మేఘనాధమఖధ్వంస కారిణేభయ హారిణ! 
అశోకవనవిధ్వంస కారిణేతి నమోనమః !! 

వాయుపుత్రాయవీరాయ ఆకాశోద్ధర గామినే ! 
వనపాల శిరచ్ఛేద లంకా ప్రసాదభంజినే !! 

జలత్కనకవర్ణాయ దీర్ఘలాంగూల ధారినే ! 
సౌమిత్రీజయదాత్రేచ రామదూతాయనే నమః !!


ఆంజనేయస్వామి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాత . మంగళకరమైన మంగళవారం ఆ స్వామి పాదాలనే స్పర్శిస్తూ ఆరాధిద్దాం. 


Next
Previous