భగవంతుడు ఉన్నాడా ఉంటే కనిపించడేం?





భగవంతుడన్నాడా ! ఉంటే కనిపించడేం అంటే! పగటిపూట నక్షత్రాలను మనం చూడలేము. అంతమాత్రాన. నక్షత్రాలు లేవని అర్థం కాదు. పాలలో వెన్న ఉంది కాని అది కనిపించదు. పాలను తోడుపెట్టి పెరుగును చిలికితే వెన్నలభిస్తుంది. చెరువులో చేపలను పట్టాలను కుంటే గాలం వేసి నైపుణ్యంతో చేపను ఒడ్డుకి లాగాలి. అలాగే కేవలము భగవంతుడిని చూడాలి అనే ఆకాంక్ష ఉన్నంత మాత్రాన భగవత్ సాక్షాత్కారం లభించదు. సజ్జనుల, సాధుపుంగవుల ఉపదేశాల పైనవిశ్వాసం ఉంచాలి. వారి యొక్క ఉపదేశాలు అనుసరించాలి. మనస్సును గాలంలా 
ప్రాణాన్ని కొక్కెంలా తయారుజేసికోవాలి. భక్తీ జపమూ ఎరగా వేయాలి , అప్పుడు
భగవత్ సాక్షాత్కారం తప్పక. కలుగుతుంది. 

చాలామంది అంటూ ఉంటారు. మనం మానవులం. అయన భగవంతుడు. మనం తప్పు చేస్తే ఆయన క్షమించాలి కదా! అని. 
మనం అయన రూపాలం తప్ప వేరే ఏది కాదు. ఆయన హావభావాలే మన హావభావాలు. ముందుగా ఆయనే నువ్వని, నువ్వే అయన అని తెలుసుంటే అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. మోక్షం కరతలామలకం అవుతుంది. అయన దేవుడు నేను మనిషిని అయన క్షమించాలి అనుకున్నంతకాలం, భగవంతుడికి నీకు బేధం ఉంది అని వేరు చేసి చూసినంతకాలం అయన దరికి చేరడం అసాధ్యం.

అలాగని నిన్ను నువ్వు పూజించుకోమని కాదు! ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించు. ఎందుకంటే నీచుట్టూ ఎందరో ఎన్నో పనులు చేయకపోతే నువ్వు ఒక చోట కుదురుగా కూర్చుని పనిచేయలేవు. నీకు సంబంధించినవారు, సంబంధం లేనివారు ఎందఱో ఎన్నో పనులు చేస్తుంటే నువ్వు సుఖపడుతున్నావు. ఇది గుర్తించిన మరుక్షణం నీలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. 

Next
Previous