ఆరిపేయవే దీపమా ఎలుతురులో నిను నేను సూడలేను..





ఆరిపేయవే దీపమా
ఎలుతురులో నిను నేను సూడలేను
సీకట్లో నీ కళ్ళు సింత్రంగా సూడాలి

తళ తళ ల మిలమిల ల
సుక్కల్లే నీ సూపు

నను సూసి నీవేమో  కంట నీరెడతావు
కనిపాపతో నన్ను మన సదరగొడతావు
నిను నేను సూడాలి
ఆరిపేయవే దీపమా
తలుసుకొని తలుసుకొని
నవ్వుకోవాలి
సిగలోని సిరిపూలు సర్దుకోవాలి
కన్నుల్లో నీ రూపు నింపుకొని
కనుబొమ్మ సుడాలి కమ్మగుండాలి
సీకట్లో నా కళ్ళు
సిల్లులడ సూడాల
పిలిచి పిలవాగానే
తెలివిరావాల
ఆరిపేయవే దీపమా
ఒకరినొకరు సూసి
అదమరసి నవ్వేసి
వొకరెరుగ కింకోరు
వొరిగి నిద రోదాము
ఆరిపెయ్యవే దీపమా.
             సంధ్య.....


Next
Previous