సమస్య అనేది జీవితంలో ఒకేసారి వస్తే ఆందోళన చెందడంలో అర్థం ఉంది..





నేను చాలామందిని చూసాను. ఏదైనా సమస్య వస్తే తెగ ఆందోళన చెందుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తరువాత బాధ పడుతూ ఉంటారు.

సమస్య అనేది జీవితంలో ఒకేసారి వస్తే ఆందోళన చెందడంలో అర్థం ఉంది. కాని నిత్యం ఎదో ఒక సమస్య మన ముందు ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. సమస్య వచ్చింది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. పరిష్కరించలేని సమస్యలు ఉండవు. 

      నూతనంగా వివాహం జరిగింది. నెల రోజుల తరువాత అమ్మాయి మూట ముల్లె సర్దుకొని పుట్టింటికి వచ్చేసింది. ఎందుకు అంటే! అబ్బాయిని శోభనం గదిలోకి పంపితే మూడ్ లేదని వెళ్ళిపోతున్నాడు అందుకే వచ్చేశాను అంది. బాగానే ఉంది. ఇప్పుడు ఇంట్లో మరొక పెళ్లి చేస్తారు. వాడు కొన్నాళ్ళ కాపురం తరువాత మూడ్ లేదు అంటే అప్పుడు ఎం చేస్తారు. లేదా చేసుకున్న కొన్నాళ్ళకి అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడేం చేస్తారు? ఇలాంటివి అనేక సమస్యలు వస్తాయి. అన్నిటికి పరిష్కారాలు చూడాల్సిందే తప్పదు. విడిపోతూ పోతూ పోతూ ఉంటె ఆగేది ఎక్కడ? ఇది ఉదాహరణ మాత్రమే!

ఇలాగే అనేక సమస్యలు నిత్యం మనల్ని పలకరిస్తూ ఉంటాయి. బెదిరిపోతూ పారిపోతూ ఉంటె పరిష్కారం దొరకదు. పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఉండే అంతర్గత శక్తి పెరుగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. పదిమందిలో గుర్తింపు వస్తుంది. సమస్యను చూసి పారిపోవడం అంటే అది నీ ఒక్కడితో/ ఒక్కదానితో పోదు. మీ చుట్టూ ఉండే బంధు జనం, మిత్ర జనంలో మీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేస్తుంది. పిరికిపంద. పొరబాటున మీరు ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు మీ ముందు అనలేకపోయినా వేనుకనైన "వీడికే/దీనికే ఒక దిక్కులేదు. సలహాలు చెప్పడానికి బయలుదేరాడు/దేరింది.) అనేస్తారు. విలువలు పాతాళం స్థాయిలో పడిపోతాయి. ఎదురుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లు మద్దతు పలికినా ఒకానొక సమయంలో మిమ్మల్ని ముఖ్యమైన విషయాలలో లెక్కలోకి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే సమస్యలకి మీరు అప్పటికే బెదిరి పారిపోయారు. ఇలా నలుగురిలో పలుచన అయిన తరువాత బ్రతికి ఉపయోగం ఏముంది?
అదే గనుక మీరు సమస్యలని పరిష్కరించుకుంటూ వెళితే వచ్చే గౌరవమే వేరు. మీ చుట్టూ ఉండేవారు మిమ్మలి ఆశ్రయిస్తారు.సలహాలు సూచనలు అందుకుంటారు. మీ గౌరవం తారాస్థాయికి చేరుతుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ సలహా కోసం వెదికి మరీ మిమ్మల్ని పట్టుకుంటారు. సంఘంలో పలుకుబడి, ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఇలా ఒకటి రెండు ఏమిటి లెక్కలేనన్ని వచ్చి మీచుట్టూ చేరతాయి. జీవితం దినదిన వృద్ధి చెందుతుంది.

ఇదే పారిపోవడానికి పరిష్కరించడానికి తేడా? మీ చుట్టూ మీరు ఏర్పాటు చేసుకునే ముళ్ళ/కంచు కోట..


Next
Previous