ఈ సువిశాల విశ్వంలో, ఈ అనంత కాలగమనంలో మనిషి ప్రయాణం ఎంత?


కోపం, అహంతో నేను, నాది అనే భావనతో ఎదుటివారిని చులకనగా చూడటం, ఆడదాని మాయలో పడి తల్లి తండ్రులని విస్మరించడం, డబ్బే సర్వస్వం అనుకోని ఆ డబ్బుకోసం చేయరాని పనులన్నీ చేయడం, ఎందుకు బ్రతుకుతున్నమో, ఎలా బ్రతకాలో కూడా కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకపోవడం,.. డబ్బు, కోరికలు తీర్చుకోవడమే పరమావధిగా మార్చుకున్న ఈ మనిషి ప్రయాణం ఎటు వెళ్తుంది? వినాశనానికి ప్రయాణం చేస్తూ అదే ఆనందం అనే బ్రమలో ఎన్నాళ్ళు బ్రతుకుతారు?ఒక్కసారి కళ్ళు మూసుకొని విశ్వాన్ని దర్శించు. ఈ విశాల విశ్వంలో, అనంతమైన కాలగమనంలో నువ్వు ఒక రేణువు. పరమాణువు. నీదంటూ ఏది శాశ్వతం లేదు ఇక్కడ. శాశ్వతంగా ఉన్నది ఒక్కటే విశ్వశక్తి. దాన్ని గుర్తెరిగి నడచుకో. ఈలోకంలో శాశ్వత ప్రతిష్ట సంపాదించుకున్నది ఒక్కటే! అదే ధర్మం. ధర్మాన్ని నమ్మి ఆచరించిన వాళ్ళు ఈ రోజుకి శాశ్వతంగా మన మధ్య, మన తలపుల్లో బ్రతికే ఉన్నారు. అధర్మాన్ని నమ్ముకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు... కాబట్టి ఎలా నడచుకోవాలో నిర్ణయించుకో. ధర్మాన్ని పాటించండి. శాంతిని కోరుకోండి. విజయం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది.

శ్రీశ్రీ

Next
Previous