సేతుబంధే రామేశం





     తమిళనాడు రాష్ట్రం నందు దక్షిణ-తూర్పున గల బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం మధ్యన రామేశ్వరం అను ఒక చిన్న ద్వీపం ఉంది. ఇది మహావిష్ణువు చేతి లోని శఖం ను పొలి ఉంటుంది.  ఇచ్చట శ్రీ రాముడు ప్రతిష్టించిన శివలింగమును దర్శించగలం.  దేవాలయం నకు తూర్పు దిశగా అగ్నితీర్ధం (సముద్రం) కలదు.  ఆలయం లోపల 22 తీర్ధాలు (బావులు) ఉంటాయి.  భక్తులు ముందుగా అగ్ని తీర్ధం, పిమ్మట 22 తీర్ధాలలో పవిత్ర స్నానములు ఆచారించుట జరుగుతుంది.  ప్రధానాలయం నందలి శ్రీ రామనాథ జ్యోతిర్లింగముతో పాటు హనుమంతుడు తెచ్చిన విశ్వనాథ లింగమును కూడ దర్శించగలం.  శ్రీ దేవేరి పర్వత వర్ధిని కి ప్రత్యేక ఆలయం కలదు. దేవాలయం నందు శ్రీ రామ సన్నిధి, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, సేతు మాధవ సన్నిధి మొదలగు వాటిని దర్శించవచ్చును. క్షేత్రం నందలి గంధ మాధవ పర్వతం, రామ తీర్ధం, లక్ష్మణ తీర్ధం, సీతా గుండం, కోదండరామ ఆలయం, ధనుష్కోటి మొదలగు వాటిని సందర్శించుటకు రవాణా సౌకర్యములు దొరుకుతాయి. శ్రీ రాముడు ధనుష్కోటి నుంచి లంక కు సముద్రం లో సేతును నిర్మించాడు.

     మధురై నుంచి రామేశ్వరం నకు వయా మనామధరై జంక్షన్ మీదగా రైలు & రోడ్ మార్గములున్నాయి. వీటి మధ్య రైలు & బస్సులు కలవు.  చెన్నై (ఎగ్మోర్) నుంచి రామేశ్వరం నకు రైలు సర్వీసులు వయా చిదంబరం, కుంభకోణం, తంజావూరు, తిరుచ్చిరాపల్లి, మనామధురై జంక్షన్ మీదగా ప్రతి రోజు ఉంటాయి. చెన్నై (కోయంబేడు) బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం కు బస్సులు కలవు.

     తిరుచ్చిరాపల్లి - రామేశ్వరం బస్సులు వయా మనామధురై మీదగా ఉంటాయి.  కన్యాకుమారి - రామేశ్వరం బస్సులు వయా తిర్చుందూర్, రామనాథపురం మీదగా కలవు.
-----------------------------------------------------
తమిళనాడు & కేరళ ఆలయాలు సమాచారం కొరకు "దివ్యదేశాలు" అను పుస్తకము ఖరీదు చేయండి.  మీకు సహయబడగలదు.
Source : hindu-హిందూ


Next
Previous