వరద గుడి అంటే ఏమిటి? ఇది దేనికి సూచన?


వరద గుడి 

ఇది వర్షం రాకకి సూచన. ఈ వరద గుడి చంద్రుడికి దగ్గరగా ఉంటె వర్షం ఇప్పటిలో లేనట్లు. చంద్రుడి చుట్టూ దూరంగా వేస్తె ఒకటి రెండు రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి అనేది సూచన. ఇది చంద్రుడి చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. అంతేకాదు ఇంద్రధనస్సులా రంగులు కూడా కనబడతాయి. విశేషం ఏమిటంటే! ఆసమయంలో మేఘాలు చంద్రుడిని కప్పలేవు. పెద్ద వరద గుడి కట్టినప్పుడు మేఘాలు కనీసం వలయంలోకి కూడా ప్రవేశించలేవు.

Next
Previous