తల్లిదండ్రులను వదిలి రమ్మని భార్య బలవంతం చేస్తే విడాకులు కోరవచ్చు.. సుప్రీంకోర్టు..

కనిపెంచిన అమ్మానాన్నలను వదిలి కట్టుకున్న తనతో రావాల్సిందే అని భార్య వత్తిడి చేస్తే ఆమెకు నిస్సందేహంగా విడాకులు ఇచ్చేయవచ్చు. అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలను చూసుకోవడం కుమారుడి ధర్మం. ఇది సర్వసాధారణంగా జరగాల్సిన ప్రక్రియ. అని తెలిపింది. భర్తను అతని తల్లిదండ్రుల నుండి వేరుచేయాలని భార్య ప్రయత్నించడం క్రూరత్వమేనని విడాకులు మంజూరు చేసేందుకు ఇలాంటి ఉదంతాలు అర్హమేనని సర్వోన్నత న్యాస్థానం తెలిపింది. హిందూ ధర్మంలో తల్లిదండ్రులను చూసుకోవలసిన భాద్యత కుమారుడిదే! ఆకట్టుబాట్లకు చెల్లుచీటి ఇచ్చి, వేరుకాపురం పెడదామని భార్య కోరితే అందుకు తగిన కారణం ఉండి తీరాలి. వృద్ధులైన తనపై ఆధారపడిన తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల నుండి వేరు పడడాన్ని సహించడు. తన ఆదాయం పైనే తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అది మరీ కష్టం. అయినప్పటికీ వేరుకాపురానికి భార్య పట్టుబడితే అది భర్తకు హింసాత్మకమే. అలాంటి భార్య చర్యలు క్రూరత్వం క్రిందికే వస్తాయి. ఇలాంటి కేసుల్లో విడాకులు మంజూరు చేయవచ్చు. కని పెంచి చదివించిన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కుమారుడి నైతిక మఱియు చట్టపరమైన భాద్యత అని పేర్కొంది. మనం వేరుగా ఉందాం అనడం మన సంస్కృతికి విలువలకు దూరం కావడమే అని వ్యాఖ్యానించింది. పెళ్ళీకాగానే ప్రక్కకు వెళ్లిపోవడమనేది పాశ్చాత్య ధోరణి అని తెలిపింది. తగిన కారణం లేకుండా వేరుకాపురం పెడదామనడం కుదరదని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి భర్త నుండి పరిహారం కోరే హక్కు భార్యకు లేదని స్పష్టం చేసింది. ...


కోర్టు చెప్పింది అక్షర సత్యం. మొన్నీమధ్య మా బంధువు ఒకడికి వివాహం జరిగింది. జరిగింది మొదలు "నాకు  ఎవరితో పనిలేదు. నాకు నువ్వు చాలు. నేను ఎవరితో మాట్లాడాను. విడిగా వెళ్ళిపోదాం" అని ఒకటే గొడవ. సర్దిచెప్పారు వినలేదు. ఎవరి కొంపలు కూల్చడానికి వచ్చావు? అని పుట్టింటికి పంపించి వేశారు. పాతికేళ్ళు పెంచి చదువులు చెప్పించి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది, ఎన్నో విలువలు నేర్పి, పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉండాలని భార్యగా నిన్ను ఇచ్చి వివాహం చేస్తే "విడికాపురం పెడదాం. మనకి వీళ్ళతో పనిలేదు. నీకు నేను నాకు నువ్వు" అంటే కళ్ళల్లో పెట్టుకొని పెంచి కొడుకే ఆధారం అనుకోని కనిపెంచిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఇలాంటి కోడళ్ళకి పెద్ద శిక్షే పడాలి. అంతేకాదు.

పెళ్ళాం కొంగులు పట్టుకుతిరిగే వెధవలు దద్దమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళని భార్యలు కొంచం స్పృహ కలిగించాలి. ఎప్పటికైనా కలసి ఉంటేనే కలదు సుఖం ..




Next
Previous